10, జూన్ 2023, శనివారం

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడాలను, అమితమైన జ్ఞాసంపదగా పేరొందిన గ్రంథాలయాలను సైతం ధ్వంసం చేయడం మొదలెట్టారు. గజినీ మహమ్మద్ సోమనాథ్ దేవాలయంపై దండెత్తి అక్కడి సంపదనంతా దోచుకుపోయిన సంఘటన అందరికీ తెలిసిన విషయమే... కానీ అటువంటి వారు ఆధునిక కాలంలో కూడా మనమధ్యే ఉన్నారని, వారి వల్ల ఎన్నో దేవాలయాలు మసీదులుగా మారుతున్నాయని గురజాడ ఈ కథ ద్వారా తెలియజేస్తున్నారు.

పెద్ద మసీదు కథను గురజాడ కేవలం 500 పదాల్లో, ముడు పేజీల్లో కూర్చారు. ఇందులోని ప్రధాన పాత్రలు మూడు - నారాయణ భట్టు, పుల్లంభట్టు గురు శిష్యులు, సాయిబు - మసీదులోని ముస్లిం మత ప్రతినిధి. 

గోల్కొండ పాదుషాహి ఫర్మానుల సీలు ఇప్పటి శ్రీ కాకుళంలో విప్పటం చేత దీనికి సికాకోల్, చికాకోల్ అనే పేర్లు వచ్చాయని ప్రజలు అనుకుంటారు కానీ అది నిజం కాదని అక్కడ శ్రీకాకుళేశ్వరుడి దేవాలయం ఉండేదని ఆ దేవాలయం పేరుమీదుగా శ్రీకాకుళం అని పేరొచ్చిందనే చర్చతో కథ ప్రారంభం అవుతుంది. నేడు ఉన్న పురాతన నగరాలకు మన దేవాలయాల పేర్లే మూలమని ముస్లిం పాలన కారణంగా కాలక్రమంలో వాటికి ముస్లిం పేర్లు ఆక్షేపించారని గురజాడ ఈ వాక్యాల ద్వారా తెలుపుతున్నారు.  

కాశీ నుంచి నారాయణభట్టు, పుల్లంభట్టు తాము పుట్టి పెరిగిన నగరమైన శ్రీకాకుళంకు వస్తుంటారు. గురువు నారాయణ భట్టు తన శిష్యుడైన పుల్లంభట్టుతో శ్రీ కాకుళం విశిష్టతను, అక్కడి శ్రీ కాకుళేశ్వర ఆలయ విశిష్టతను చెబుకుంటూ నగరంలోకి ప్రవేశిస్తారు. తన శిష్యుడికి ఆ ఆలయాన్ని చూపిస్తానని ఆ ఆలయ స్థలానికి వెళ్తారు. కానీ అక్కడ దేవాలయం స్థలంలో ఒక పెద్ద మసీదు నిర్మించబడి ఉంటుంది. దాన్ని చూసి ఆశ్చర్యపోయిన గురువు నారాయణభట్టు చేసేదేమీ లేక తిరిగి కాశీకి వెళ్దామని శిష్యుడితో అంటాడు. ఎలాగూ ఇంతదూరం వచ్చాం కదా దేవాలయం ఎక్కడికి పోయిందో, అక్కడ మసీదు ఎలా ఏర్పాటయిందో తెలుసుకుందామని శిష్యుడు పుల్లంభట్టు అంటాడు. గురుశిష్యులిద్దరూ మసీదులోని సాయిబుని పిలిచి దేవాలయం గురించి అడుగుతారు. అప్పుడు ఆ సాయిబు ఇక్కడ ఎటువంటి దేవాలయం లేదని, ఇక్కడినుండి వెళ్లిపొండని ఆజ్ఞాపిస్తాడు. ఆకలితో ఉన్నామని ఆహారం కోసం దగ్గర్లో తన మావ గార్లైన రామావధానులు, లక్ష్మణ భట్టు గార్ల భోజనశాల ఒకటి ఉండాలని అది ఎక్కడుండని సాయిబును నారాయణభట్టు అడుగుతాడు. ఇలా అడగగానే సాయిబు చేతిలోని చిలుము నేలపై పడి నిప్పులు నాలుగు దిశలకు వెళ్లగా 'నారాయణా!' అని పలకడంతో కథ ముగుస్తుంది.

ఇది చదివాక గురజాడ కథను ఇలా అర్థాంతరంగా ముగించారేమి అన్న అనుమానం కలిగింది. కానీ తర్వాతి కథ పాఠకుల ఊహకే వదిలిపెట్టారన్న దాన్ని గ్రహించేకపోయా. దీనిపై వచ్చిన సమీక్ష చదివాక అసలు విషయం అర్థమైంది. కథలోని ప్రాణమంతా ఇక్కడే ఉందని గ్రహించా. అదేమంటే నారాయణభట్టు తమ మామగార్ల పేర్లు చెప్పగానే "నారాయణా!" అంటూ సాయిబు ఆశ్చర్యపోయారు అంటే ఆ సాయిబే నారాయణభట్టు మామగారన్నమాట. అంటే ముసల్మానుల పాలనా కాలంలో దేవాలయాలను కొల్లగొట్టడమే కాకుండా అమాయకులైన ఇతర మతస్తులను ముస్లిం మతంలోకి మతమార్పిడి చేసుకున్నారని అర్థమౌతుంది.

ఇలా అధికారంలో ఉన్న అప్పటి ముస్లిం మత పెద్దలు చేసిన దురాచారాలను ప్రజలకు తెలియజేసే రీతిలో గురజాడ రచించిన ఈ పెద్దమసీదు కథ చరిత్రలో చెరగని ముద్రగా నిలిచిపోయింది. చిన్న కథే అయినా ఇందులో అద్భుతమైన సందేశాన్నిస్తూ ప్రజలను ఆలోచింపజేసే దిశగా ఈ కథ సాగడం గురజాడ అమితమైన ప్రతిభకు తార్కాణంగా చెప్పవచ్చు.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...