11, ఆగస్టు 2022, గురువారం

శ్రావణమాసంలో మాంసాహారం నిషేధం ఎందుకు?

శ్రావణ మాసంలో చాలా మంది మాంసాహారాన్ని నిషేధిస్తారు. అయితే ఈ నెలలో కేవలం శాకాహారానికి మాత్రమే ఎందుకు ప్రాధాన్యత ఇస్తారు. దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలు ఏంటనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

హిందూ ధర్మం ప్రకారం, 

ఈ నెల రోజుల పాటు భక్తిశ్రద్ధలతో భగవంతుడిని పూజిస్తారు.

ఆయుర్వేద శాస్త్రం ప్రకారం, 

శ్రావణ మాసంలో రోగ నిరోధక శక్తి చాలా తక్కువ స్థాయిలో ఉంటుంది. ఇలాంటి సమయంలో వర్షాలు కూడా జోరుగా కురుస్తాయి. కాబట్టి ఈ కాలంలో మాంసాహారం, మసాలా లేదా నూనె వస్తువులను ఎక్కువగా తింటే అది రోగ నిరోధక శక్తిపై ప్రభావం చూపుతుంది. అంతేకాదు మన జీర్ణ వ్యవస్థ కూడా సక్రమం పని చేయదు. ఇలాంటి సమయంలో మనం శాకాహారం తీసుకుంటే సులభంగా జీర్ణమవుతుంది. అందుకే ఈ నెలలో మాంసాహారానికి దూరంగా ఉండాలి.

శ్రావణ మాసంలో మన శరీరం చాలా బలహీనంగా ఉంటుంది. జీర్ణ వ్యవస్థ మరింత బలహీనంగా ఉంటుంది. ఈ కాలంలో అంటువ్యాధులు చాలా వేగంగా ప్రబలే అవకాశం ఉంది. ఇలా రోగాలు ప్రభలిన జంతువుల మాంసాహారం తీసుకుంటే మన శరీర ఆరోగ్య సమతుల్యత దెబ్బతినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే విధంగా ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అందుకే ఈనెలలో మాంసాహారానికి దూరంగా ఉంటారు.


ఇదే నెలలో జంతువులు ప్రసవించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో వాటిని వధించడం మంచిది కాదని, ఈ కారణంగా శ్రావణ మాసంలో మాంసాహారాన్ని తీసుకోవడాన్ని నిషేధించారు.


--✍🏻✍🏻వివేకభారతి (అభిలాష్)

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...