6, నవంబర్ 2022, ఆదివారం

ఆలయాలు శక్తి జనకాలు

ఆధునిక యుగంలో విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు, పవన విద్యుత్ కేంద్రాలు, ట్రాన్స్ఫార్మర్లు, ట్రాన్స్మిషన్లు, విద్యుత్ స్తంభాలు, సెల్ టవర్లు మొదలైనవి రూపుదిద్దుకోవటం మొదలై కేవలం 200 సంవత్సరాలయింది. కానీ లక్షల సంవత్సరాలకు ముందే మన ఆలయాల విమాన గోపురాలు, ధ్వజ స్థంభాలు, ఆలయ శిఖరాలు నేటి ఆధునిక యుగంలో వెలసిన సాంకేతిక పరికరాల ఆకారంలోనే నిర్మించబడి ఉన్నాయి. అందుకే లక్షల సంవత్సరాల ముందుచూపు గల మన పూర్వీకులు అనాగరికులు కాదు ఆధునికులు. వారు చేసిన మేలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఈ వ్యాసాన్ని చదివి తెలుసుకోండి.



ఔషధం

దేవాలయాల ప్రాంగణంలో ఉండే తులసి, మారేడు, రావి వంటి చెట్లు గాలిని శుభ్రం చేసే పవిత్రమైన ఆయుర్వేద ఔషధాలుగా పనిచేస్తాయి. చెట్టు నుండి ఆకును వేరు చేసినా ఇరవైనాలుగు గంటలవరకు ప్రాణవాయువును అందించేవి మామిడాకులు. అందుకే శుభకార్యాలలో ఒకే దగ్గర అనేక మంది గుమిగూడినా అందరికీ తగిన ఆక్సిజన్ అందాలని మన సంప్రదాయాలలో మామిడి తోరణాలు కడతారు.

తంత్రం

దేవాలయాలలో అక్కడి అర్చకులు వేసే ముద్రలు సూక్ష్మ వ్యాయామంగా ఉపయోగపడి శరీరంలోని ప్రాణశక్తిని ప్రేరేపిస్తాయి. దీని ద్వారా ఏకాగ్రత శక్తి మరింత పెరుగుతుంది దీన్నే ఆధ్యాత్మికంగా చెప్తే తంత్రం అంటాము.

మంత్రం

ఆలయ అర్చకుల మంత్రోచ్ఛరణ నుండి విద్యుదయాస్కాంత తరంగాలు ఉత్పత్తి అవుతాయి. ఇవి మనసును ఆహ్లాదకరమైన వాతావరణంలోకి తీసుకెళ్తాయి. ఆ మంత్రాల యొక్క అర్థాలు సూక్ష్మ భావ తంరగాలుగా మారి మనస్సును ఉత్తేజపరుస్తాయి. దీన్నే మంత్రం అంటారు.

యంత్రం

దేవాలయాలను నిర్మించేటపుడు భూమి పూజ కార్యక్రమంలో అనేక రకాలైన లోహాలను, నవ రత్నాలను భూమిలో వేసి నిక్షిప్తం చేస్తారు. ఇవి భూ శక్తి గ్రాహకాలుగా పనిచేస్తాయి. తద్వారా దేవాలయంలోని శక్తి నిక్షిప్తం చేయబడుతుంది.

ధ్వజస్తంభాలకింద, మూలవిరాట్టు కింద లోహ నిర్మిత పలకలను అమర్చుతారు. ఆలయ శిఖరాలపై, ధ్వజస్థంభాలపై లోహపు కలశాలు, లోహపు తొడుగులు వేస్తారు. ఉత్సవ విగ్రహాలను సైతం పంచలోహాలతో తయారు చేస్తారు. ఇలా ఎందుకు చేస్తారంటే లోహం అనేది శక్తికి వాహకంగా పని చేస్తుంది. వాయు పదార్థాలలో అణువులు దూరం దూరంగా ఉంటాయి, అదే ద్రవ పదార్థాలలో కొంచం దగ్గర దగ్గరగా ఉంటాయి, అదే పంచాలోహం  వంటి ఘాన పదార్థాలలో అణువులు మరింత దగ్గర దగ్గరగా ఉంటాయి. కాబట్టి వీటిలో ఒక అణువు నుండి మరొక అణువుకు శక్తి సులభంగా ప్రసరిస్తుంది. కాబట్టే ఆలయాల్లో ఇలాంటి లోహపు పదార్థాలు వాడుతారు. ఇలా వాడటాన్నే ఆధ్యాత్మికంగా యంత్రం అంటారు. మంత్ర తంత్రాల ద్వారా ఉత్పత్తి అయ్యే శక్తికి ఈ యంత్రాలు గ్రాహకాలుగా పనిచేస్తాయి.

అభిషేకం

ఆలయాల్లో చేసే అభిషేకాలు పంచలోహ విగ్రహం అయిన మూలవిరాట్టు విగ్రహంపై ఎత్తు నుండి చేస్తారు. ఇలా ఒక లోహం పై ఒక ద్రవ పదార్థం ఎత్తునుండి పడటం ద్వారా స్థితి శక్తి గతి శక్తిగా మారుతుంది. దీన్ని మనం జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో నీరు టర్పైన్ల పై పడి విద్యుత్ శక్తి ఉత్పత్తి కావడంతో పోల్చుకోవచ్చు. అంటే మన ఆలయాలలో కూడా అభిషేకాల ద్వారా గతిశక్తి ఉత్పత్తి అవుతుందన్నమాట.

ఇలా మంత్ర, తంత్ర, యంత్రాల ద్వారా విశ్వవ్యాప్తంగా అంతర్గతంగా ఉన్న శక్తిని గ్రహించి నిల్వ చేసుకొని దగ్గరకు వచ్చే భక్తులకు అందించే శక్తి నిర్వహణ కేంద్రాలు మన ఆలయాలు.

ఆలయ వ్యవస్థ

విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలలో, జనరేటర్ల ద్వారా ఉత్పత్తి అయిన విద్యుత్  ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా టెర్మినల్ స్టేషన్లకు వెళ్లి అక్కడి నుండి  సబ్ ట్రాన్స్ఫార్మర్స్ ద్వారా విద్యుత్ స్థంభాల సహాయంతో  తక్కువ వోల్టేజ్ గల ఇళ్లకు, ఎక్కువ వోల్టేజ్ గల పరిశ్రమలకు అందుతుంది. సరిగ్గా ఇదే వ్యవస్థ మన ఆలయాల్లో కూడా కనిపిస్తుంది. ఎలా అంటే,  విద్యుత్తుత్పత్తి చేసే జనరేటర్ వంటి గర్భ గుడి నుండి అర్చకులనే ఎలక్ట్రిషన్స్ సహాయంతో శక్తి బయటకు వచ్చి అంతరాలయంలో ప్రయాణించి, పరివార దేవతల ద్వారా విస్తరించి, విద్యుత్ స్తంభాల వంటి ధ్వజస్థంభాల సహాయంతో  అధిక వోల్టేజ్, అల్ప వోల్టేజ్ అని ఇంతకు ముందు చెప్పుకున్నట్టు సామాన్యుల నుండి మహా భక్తుల దాకా ఈ శక్తి అందరికీ అందుతుంది. అందుకే గుడికి వెళ్లే భక్తులు గ్రహణ శక్తిని పెంపొందించుకొని, ప్రశాంతతను పొందుతున్నారు. అదే శక్తితోనే తమకు ఉన్న సమస్యలను ఎదుర్కొంటున్నారు.

గురజాడ కథా మంజరి - మతము:విమతము (పెద్దమసీదు)

భారతదేశం జ్ఞాన సంపదను పుట్టినిల్లు. దీన్ని చూసి జీర్ణించుకోలేని విదేశీ మూకలు ఎలాగైనా నాశనం చేయాలని ఇక్కడి అపూర్వ దేవాలయాలను, చారిత్రక కట్టడా...